Ads 468x60px

facebook

sada mee sevalo

Tuesday 31 December 2013

Gattu Naresh New Songs


Monday 9 September 2013

Vinayaka Wishes

Mitrulandariki Vinayaka Chavithi Shubakanshalu

Sunday 8 September 2013

Vinaykudi Roopalu


విఘ్నాధిపతి అయిన వినాయకుడిని 16 రూపాల్లో తాంత్రికులు పూజిస్తుంటారు. నిజానికి వినాయకుడికి 32 రూపాలున్నాయనీ, వీటిలో 16 మాత్రం అత్యంత ప్రముఖమైనవని చెబుతారు.
1. బాల గణపతి
2. తరుణ గణపతి
3. భక్తి గణపతి
4. విర గణపతి
5. శక్తి గణపతి
6. ద్విజ గణపతి
7. సిద్ధి గణపతి
8. ఉచ్చ్చిష్ట గణపతి
9. విఘ్న గణపతి
10. క్షిప్ర గణపతి
11. హేరంబ గణపతి
12. లక్ష్మి గణపతి
13. మాహ గణపతి
14. విజయ గణపతి
15. నృత్య గణపతి
16. ఊర్ధ్వ గణపతి
17. ఏకాక్షర గణపతి
18. వరద గణపతి
19. త్రయక్షర గణపతి
20. క్షిప్ర ప్రసాద గణపతి
21. హరిద్ర గణపతి
22. ఏకదంతా గణపతి
23. శ్రిష్టి గణపతి
24. ఉద్దండ గణపతి
25. ఋణమొచన గణపతి
26. దుండి గణపతి
27. ద్విముఖ గణపతి
28. త్రిముఖ గణపతి
29. సింహ గణపతి
30. యోగ గణపతి
31. దుర్గ గణపతి
32. సంకటహర గణపతి

Monday 26 August 2013

సహస్రార చక్రము: (గర్భ గుడి)

సహస్రార చక్రము: (గర్భ గుడి)
జీవుడికి ఆధారమైన చక్రమిది. మస్తిష్కం (తలలోని మెదడు) పనిచేస్తేనే జీవుడు ఉన్నట్లు.. మెదడు పనిచేయకుంటే.. జీవుడు గాలిలో కలిసి పోయినట్లే. మస్తిష్కం.. జీవుడికే అంతటి కీలకమైనదైతే.. సమస్త జీవకోటిని సృష్టించి, పోషించే ఆ పరంధాముడి మస్తిష్కం మరెంతటి విశిష్టమైనదై ఉండాలి..? మస్తిష్కం.. బ్రహ్మ రంధ్రానికి దిగువన వేయి రేకులతో వికసించే పద్మం అన్నది ప్రాజ్ఞుల నమ్మిక. ఈ కమలం మాయతో ఆవరించి ఉంటుందని.. ఆత్మజ్ఞానాన్ని సాధించిన పరమహంసలు మాత్రమే దీన్ని పొందగలుగుతారన్నది హిందువుల విశ్వాసం. దీన్ని శివులు శైవస్థానమని, వైష్ణవులు పరమ పురుష స్థానమని, ఇతరులు హరిహర స్థానమనీ, దేవీ భక్తులు.. దేవీ స్థానమని పిలుచుకుంటారు. ఈ స్థానం పరిపూర్ణంగా తెలుసుకున్న మనుషులకు పునర్జన్మ ఉండదని కర్మ సిద్ధాంతం చెబుతుంది.

గర్భాలయం : శరీరంలో సహస్రారం ఎంతటి విశిష్టమైనదో.. ఆలయ నిర్మాణంలో గర్భగుడి కూడా అంతే విశిష్టమైనది. దీన్ని గర్భాలయం లేదా ముఖమంటపమని అంటారు. ఇది అత్యంత పవిత్రమైనది. పరమ యోగులు.. స్వామివారి కరుణ భాగ్యాన్ని పొందిన వారికి మాత్రమే ఇందులో ప్రవేశించే అర్హత వస్తుంది.


ఆజ్ఞా చక్రము: రెండోది ఆజ్ఞా చక్రం ఇది భ్రూ (కనుబొమల) మధ్య లో ఉంటుంది. ఈ చక్రము, రెండు రంగులతో కూడిన రెండు రేకులు (దళాలు) ఉండే కమలంలా ఉంటుందట. (ఇది కూడా గర్భాలయానికి సంబంధించిన అంశమే.)

విశుద్ధి చక్రము: (అంతరాలం)
మూడోది విశుద్ధి చక్రము. ఇది కంఠ స్థానంలో ఉంటుంది. ఈ చక్రం, తెల్లగా మెరిసిపోయే పదహారు రేకులతో కూడిన కమలంలా ఉంటుందట. ఇది ఆకాశతత్వానికి ప్రతీక అన్నది విశ్వాసం.
అంతరాలం : ఆలయ నిర్మాణంలో విశుద్ధి స్థానాన్ని అంతరాలంగా పిలుస్తారు. ముఖ మంటపాన్నీ మహా మంటపాన్నీ కలిపే స్థానమే అంతరాలం.

అనాహత చక్రము: (అర్ధమంటపం)
ఇది హృదయ (రొమ్ము) స్థానంలో ఉంటుంది. బంగారు రంగులోని పన్నెండు రేకులు గల కమలంలా ఉంటుందిట. ఇది వాయుతత్వానికి ప్రతీక.
అర్ధమంటపం : గర్భాలయానికి ముందు ఉండే మంటపాన్ని ముఖమంటపం లేదా అర్ధమంటపం అంటారు. భగవంతుడి శరీరంలో రొమ్మును ఇది ప్రతిబింబిస్తుంది.

మణిపూరక చక్రము: (మహామంటపం)
నాభి (బొడ్డు) మూలంలో ఈ చక్రం ఉంటుంది. నీల వర్ణంలోని పది దళాలు (రేకులు) కలిగిన పద్మంలా ఉంటుంది. ఇది అగ్ని తత్వాన్ని ప్రతిఫలిస్తుంది.
ఆలయ నిర్మాణంలో... గొంతు నుంచి నాభి దిగువ దాకా మహా మంటపమే ఉంటుంది.

స్వాధిష్ఠాన చక్రము: (ధ్వజస్తంభం)
ఈ చక్రము లింగ (పురుషాంగం) మూలంలో ఉంటుంది. ఈ చక్రం సింధూర వర్ణం గల ఆరు దళాల కమలమట. ఇది జలతత్వాన్ని ప్రతిబింబిస్తుంది.

ధ్వజస్తంభం : ఆలయ నిర్మాణ రీతిని అనుసరించి, మహా మంటపానికి ముందు ఈ స్తంభం ఉంటుంది. దేవుడి అంగమే ఈ ధ్వజస్తంభం. అంగ మొల వేలుపు అని శివుడికి పేరు. అంగ మొల అంటే, వస్త్రాలేమీ లేని కటి ప్రదేశం అని అర్థం. ధ్వజము అన్నా కూడా జెండా అని, మగ గురి అనీ అర్థాలున్నాయి. మగ గురి లో మగ అంటే.. మగటిమి అని, గురి అంటే లక్ష్యము అని అర్థం. నిజానికి ధ్వజము అంటేనే మగ (పుంసత్వపు) గురి అన్న అర్థముంది. ఏది ఏమైనా భగవంతుడి మర్మాంగ రూపమే ధ్వజస్తంభం అనడంలో సందేహం లేదు. ఆంజనేయుడి ధ్వజస్తంభానికి మండల కాలం పూజలు చేసి ప్రదక్షిణలు చేస్తే.. వివాహాది ఇష్ట కార్యసిద్ధి కలుగుతుందన్న విశ్వాసం కూడా ధ్వజస్తంభం విశిష్టతను చాటుతుంది.

మూలాధార చక్రము:
అన్ని నాడులకూ ఆధారమైన ఈ చక్రం గుద స్థానంలో ఉంటుంది. గుద స్థానానికి పైన, లింగ స్థానానికి కింద (గుద, లింగం రెంటి మధ్యలో) ఉంటుంది. ఎర్రటి రంగులోని నాలుగు దళాల కమలమిది. ఇందులోనే కుండలినీ శక్తి నిక్షిప్తమై ఉంటుందట.

మోకాలి స్థానం : స్వామి వారి రెండు మోకాళ్లు కలిసే స్థానం. ఇక్కడ ఓ గోపుర ద్వారం ఉంటుంది. దీన్ని దుర్గపుర ద్వారం అంటారు. (దుర్గ అంటే కోట, పురం అంటే పట్టణం అని అర్థం) అంటే ప్రజలు స్వామి దర్శనానికి చేరుకునేందుకు ఇది ప్రవేశ ద్వారం.

పాదాలు : ఇది మహాప్రాకార గోపుర స్థానం. (ప్రాకారం అంటే గుడి మొదలైన వాటి చుట్టూ ఉన్న గోడ అని అర్థం. మహా అంటే చాలా గొప్పగా (పటిష్టంగా) అని అర్థం. అంటే శత్రువులు కోటలోకి రాకుండా రాజులు ఎలా దుర్భేద్యమైన ప్రాకారాన్నినిర్మించే వాళ్లో.. గుడికీ, దుష్టశక్తులు ప్రవేశించకుండా ఈ మహాప్రాకార గోపురాన్ని నిర్మిస్తారు. మనం మహాప్రాకారం దాటి లోపలికి వెళుతుండగానే.. మన మనసుల్లోని అన్ని బాధలు, చెడు తలంపులకు కారణమైన... కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరం అనే అరిషడ్వర్గాలన్నీ ప్రాకారం బయటే నిలిచిపోతాయి. అందుకే గుళ్లోకి వెళ్లగానే మన మనసు ప్రశాంతమై పోతుంది.

ఇదీ గుడి నిర్మాణం.. ఆ గుళ్లో భగవంతుడి శరీర స్థానాల విశిష్టతల గురించిన సమాచారం. కాబట్టి, ఇకమీదట గుడికి వెళ్లేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకుని, స్వామిని మనస్పూర్తిగా ధ్యానించండి. భగవంతుడి ఆశీస్సులు పొందండి. సర్వే జనాస్సుఖినో భవంతు.
 

Monday 5 August 2013

Sneha Balam

స్నేహబలం

హిరణ్యకుడు అను ఎలుక, చిత్రాంగుడు అనే జింక, మంథరుడు అనే తాబేలు, లఘుపతకము అనే కాకి వీళ్ళు నలుగురు మిత్రులు. కర్పూర గౌరవము అనే చెరువులో తాబేలు ఉండేది. ఆ చెరువులో ఒడ్డున ఉన్న చెట్టు తొర్రలో ఎలుక, ఆ చెట్టు మీద కాకి ఉండేది. ఆ ప్రక్కనే ఉన్న పొదలో జింక ఉండేది.

సాయంత్రపు పూట ఈ నలుగురు మిత్రులు ఒకేచోట చేరి సరదాగా కబుర్లు చెప్పుకొంటూ ఆనందంగా జీవిస్తూ ఉండేవారు. ఒక రోజు మథ్యాహ్నమనగా ఆహారం కోసం వెళ్ళిన జింక సాయంత్రం అవుతున్నా తిరిగి రాకపోవటంతో తాబేలు, ఎలుక, కాకి కంగారు పడ్డాయి. చాలా సేపు ఎదురుచూసినా జింక వస్తున్న జాడ కనిపించలేదు.

'స్నేహితులారా! చిత్రాంగుడు ఇంతసేపయినా ఇంటికి తిరిగి రాలేదంటే ఏదో ప్రమాదంలో చిక్కుకొని ఉంటాడు అంది తాబేలు కంగారుగా. 'అవును నిజమే!' అన్నాయి ఎలుక, కాకి. 'ఇప్పుడు ఏం చేద్దాం!' అనుకున్నాయి ఆ మూడు. స్నేహితులారా! నేను ఎగిరివెళ్ళి అడవంతా చూసివస్తాను' అంటూ కాకి రివ్వుమంటూ ఆకాశంలోకి ఎగిరింది.

తాబేలు, ఎలుక చిత్రాంగుడు వస్తాడేమోనని నాలుగు దిక్కులు చూస్తూ నిల్చున్నారు. ఆకాశంలో ఎగురుతున్న కాకికి ఒకచోట జింక కనిపించిది. కాని అది వేటగాడు పన్నిన వలలో చిక్కికుపొయి బాధతో గింజుకుంటోంది. కాకి జింక ముందు వాలింది. కాకిని చూసి జింక ఆనందంతో 'వచ్చావా! లఘుపతనకము ఆహారం కోసం వచ్చి చూసుకోకుండా వేటగాడు పన్నిన వలలో చిక్కుకుపోయాను నన్ను రక్షించవా' అంది. 'భయపడకు చిత్రాంగా! నేను మన ఎలుక మిత్రుడు హిరణ్యకుడిని తీసుకువస్తాను అతను ఈ వలను కొరికి నిన్ను రక్షిస్తాడు!' అని కాకి జింకకు ధైర్యం చెప్పి మళ్ళీ ఆకాశంలోకి వేగంగా ఎగిరి వెళ్ళి కొద్దిసేపట్లోనే ఎలుకను తన వీపు మీద ఎక్కించుకొని వచ్చి జింక దగ్గర వాలింది.

ఎలుక తన పదునైన పళ్ళతో వల కొరికి జింకను విడిపించింది. ఆ ముగ్గురు ఆనందంగా కబుర్లు చెప్పుకొంటూ తమ ఇళ్ళ వైపు నడిచారు. దారిలో వాళ్ళకి తాబేలు ఎదురుపడింది. అయ్యో! మంధరా నువ్వెందుకు వచ్చావు అనడిగాడు హిరణ్యకుడు. 'చిత్రాంగుడు ఆపదలో ఉన్నాడని తెలిసి ప్రశాతంగా కూర్చోలేకపోయాను.

మీరిద్దరూ చిత్రాంగుడిని రక్షిస్తారని నాకు తెలుసు. అయినా మనసు ఊరుకోలేదు. అందుకే వచ్చాను అంటూ సమాధానమిచ్చాడు మంథరుడు. 'నువ్వు నిజమైన స్నేహితుడివీ అంటూ చిత్రాంగుడు ఆనందంగా మంథరుడిని ముద్దు పెట్టుకున్నాడు. ఆ నలుగురూ అనందంగా కబుర్లు చెప్పుకొంటూ ఇంటి దారి పట్టారు. కొంతదూరం ఆ నలుగురు నడిచే సరికి వేటగాడు ఎదురుపడ్డాడు. వాడిని చూడగానే జింక పొదలోకి దూరిపోయింది. కాకి ప్రక్కనే ఉన్న చెట్టు మీదకి ఎగిరిపోయింది, ఎలుక ప్రక్కనే ఉన్నకలుగులోకి దూరిపోయింది. తాబేలు మాత్రం ఎటూ పారిపోలేక వేటగాడి చేతికి దొరికిపోయింది.

జింక తప్పించుకున్నా తాబేలు దొరికిందని ఆనందపడ్డ వేటగాడు తాబేలును బాణం కొసకి తాడుతో కట్టి భుజం మీద వేసుకొని ఇంటి దారిపట్టాడు. వేటగాడు కొంతదూరం వెళ్ళగానే జింక, ఎలుక, కాకి ఒక్కచోట చేరి 'అయ్యో! చిత్రాంగుడు వేటగాడి బారి నుంచి తప్పించుకున్నాడంటే మళ్ళీ మంథరుడు వీడి చేతికి దొరికాడే' అనుకుని బాధపడ్డాయి.

అప్పుడు హిరణ్యకుడు 'స్నేహితులారా! మన మంథరుడిని రక్షించుకుంటానికి నాకు ఒక మంచి ఉపాయం తట్టింది అంది. 'హిరణ్యకా! తొందరగా ఆ ఉపాయం చెప్పు అంది కాకి. 'వేటగాడు నడిచే దారిలో చిత్రాంగుడు చచ్చినట్లు పడి ఉంటాడు. అప్పుడు వేటగాడు పట్టుకుంటానికి మంథరుడిని కట్టిన బాణం క్రింద పెట్టి వెళతాడు. అప్పుడు ఆ తాడును నేను కొరికి మంథరుడిని తప్పిస్తాను' అని చెప్పింది.

ఆ ఉపాయం ఎలుకకి, కాకికి నచ్చింది. ఆ మూడు అడ్డదారిలో వేటగాడి కంటే ముందుకి పోయి ఒక చోట జింక దారికి అడ్డంగా పడుకొంది. కాకి దాని మీద వాలి ముక్కుతో పొడుస్తున్నట్లు నటించసాగింది. ఆ దారిలో నెమ్మదిగా వస్తున్న వేటగాడు జింకను చూసాడు. దాని మీద వాలి కాకి ముక్కుతో పొడవటం వల్ల అది చచ్చిపోయిందనుకొని 'ఆహా! ఏమి నా భాగ్యం. ఈ రోజు అదృష్టం నా పక్షాన ఉంది అందుకే వలలో జింక తప్పించుకున్నా ఇక్కడ మరొక జింక దిరికింది అని ఆనందపడుతూ భుజం మీద బరువుగా ఉన్న తాబేలును నేల మీద పెట్టి జింక దగ్గరకు నడిచాడు.

వెంటనే ఎలుక వచ్చి తాబేలుకి కట్టిన తాడును కొరికేసింది. కాకి 'కావ్! కావ్'మని అరుస్తూ ఆకాశంలోకి ఎగిరిపోయింది. జింక పారిపోయింది. వేటగాడు కొయ్యబారి పోయి అంతలోనే తేరుకుని తాబేలు కోసం చూసాడు. అప్పటికే తాబేలు ప్రక్కనే ఉన్న చెరువులోకి పారిపోయింది.

'ఆహా! ఏమి నా దురదృష్టం చేతిలో వున్న దానిని వొదులుకున్నాను అనుకొంటూ ఆ వేటగాడు ఇంటికి వెళ్ళిపోయాడు.

ఎలుక, జింక, తాబేలు, కాకి ఆనందంగా తమ ఇంటికి వెళ్ళిపోయాయి. చూసారా! స్నేహం అంటే ఈ నాలుగు ఉన్నట్లు ఉండాలి. ఆపదలో ఉన్న స్నేహితుడిని ఆదుకుంటానికి అవసరమైతే ప్రాణాలను కూడా ఫణంగా పెట్టగలగాలి. పనికిరాని స్నేహితులు పదిమంది ఉండే కంటే అవసరంలో ఆదుకొనే స్నేహితుడు ఒక్కడుంటే చాలు. స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం.

Sunday 4 August 2013

Vemana Padyamu & Tatparyamu

Brahmasri Chaganti Koteswara Rao Gari Sowjanyamtho


నెయ్యిలేని కూడు నీఆన కసవది
కూరలేని తిండి కుక్క తిండి
ప్రియము లేని కూడు పిండంపు కూడురా
విశ్వధాభిరామ వినురవేమ

భావము:-

నెయ్యి లేని భొజనము గడ్డితో సమానము.కూరలేని తిండి కుక్క తిండితో సమానం. ప్రేమతో పెట్టని భోజనం పిండాకూడుతో సమానం. నెయ్యిలేకపొయినా ,కూరలేకపొయినా తిండి పెట్టండి పర్వాలేదు, కాని పెట్టెదేదయినా ప్రేమతొ పెట్టండి.అప్పుడే పెట్టినవారికీ పుణ్యము వస్తుంది, తిన్నవారికి ఆకలి తీరుతుంది.కాబట్టి వంటకాల రుచి కాదు ముఖ్యం,పెట్టేవారి ఆప్యాయత,ప్రేమ ముఖ్యం.

Vivaha Mante

Brahmasri Chaganti Koteswara Rao Gari Sowjanyamtho

Theertayatralalo Mana Sampradayalu

తీర్థయాత్రలలో మన సంప్రదాయాలు

Brahmasri Chaganti Koteswara Rao Gari Sowjanyamtho


చాల మందికి కొత్త ప్రాంతాలు సందర్శిoచాలన్న కోరిక ఉంటుంది .కానీ దాన్ని సాకారం చేసుకోవడాoలొనే పలు సమస్యలు ఎదుర్కొంటారు .మిగిలిన యాత్రల సంగతి ఎలా ఉన్న తీర్థయాత్రల విషయంలో మాత్రం ప్రతి ఒక్కరు తేలుసుకోదగ్గ విషయాలు ఉంటాయీ.

"భగవంతుడు సర్వాoతర్యామి "అన్న కారణంగా ఎ యాత్ర చేయకుండ ఉంటే తరువాత కాలం గడిచి ,వృద్దప్యoలోకి వచ్చాక ,ఆధ్యాత్మిక మార్గంలోకి పట్టిన తరువాత బాధపడే స్థితి వస్తుంది .అందువల్ల ఆరోగ్యం సహకరించినప్పుడే ఆర్ధిక తదితర సమస్యలను ఏదోలా అధిగమించే కొన్ని ముఖ్యమైన తీర్థయాత్రలైనా పూర్తి చేసే ప్రయత్నం చేయాలి .

విహార ,విజ్ఞానయాత్రల మాదిరిగా ఆధ్యాత్మిక పర్యటనలను తేలీగ్గా తీసేయలేo .కొన్నీ రకాల ఆహ్హ్లదకర ప్రాంతాలను ఎప్పుడు ,ఎలా వెళ్లి చూసి వచ్చిన పెద్ద తేడా ఉండకపోవచ్చు .కానీ తీర్థయాత్రల విషయం అలా కాదు .ఆయా సందర్బాలు ,సమయాలలో అలాంటి వాటికీ ప్రతీక విలువ ,గుర్తింపు ఉంటాయీ.ఫలితంగా పుణ్యనికి పుణ్యo ,పురుషార్ధం లభిస్తాయని పెద్దలు అంటారు .అందువల్ల మంచి సమయాన్ని ఎంపిక చేసుకోండి .

ఆయా పండుగలు ,ఉత్స్ట్టవాలు ,వేడుకలప్పుడు ,సంభంతిత క్షేత్రాలు శోభయమనంగా ,వెలుగొందుతుoటాయి .ఉదాహరణకు పుష్కరాల సమయంలొ నదిస్తాన్నం ,బ్రహ్మోత్స్ట్టవాలు .కుంభ మేళాలు ,ప్రత్తేక దీక్షలు ,జాతర వేళ ఆయా ప్రదేశాలను సందర్శిoచడానికి ఆనేకమంది అదిక ప్రాధాన్యం ఇస్తూoటారు .ఇలాంటి వేళ దైవదర్శనాల వల్ల అదిక పుణ్యం సంప్రాప్తిస్తుంది అని పెద్దలు అంటారు .

ఆధ్యాత్మిక యాత్రలు చేయడానికి ముందు వెంట తీసుకెళ్లవలసిన వస్త్తువులతో పాటు ,పూజా సామాగ్రీని కూడా మరిచిపోకూడదు .ప్రతిది అక్కడికి వెళ్లాకే కొనుక్కోవచ్చు .అనుకొంటే ఒక్కోసారి అనవసరశ్రమ ,కాలయాపన ,అదిక వ్యయం తప్పకపోవచ్చు .ఆలాగే యాత్ర నుండి తిరిగి వస్తు ఆక్కడి నుండి ప్రసాదాలతో పాటు కుంకుమ ,తీర్థాలు తేచ్చుకోవడం మరిచిపోవద్దు .

దక్షిణ ,ఉత్తర ప్రాంతాలలోని ఆయా దేవలయలలో కొన్ని ప్రత్తెయేక నియమాలు ఉంటాయీ .ఉదాహరణకు తమిళనాడులోనీ గురువాయుర్ వంటి అనేక ప్రధాన క్షేత్రలలోను ,పురుషులు ప్యాoటు ,పైన చొక్కా ధరించి ఆలయ ప్రవేశం చేయలేరు .విధిగా లుంగీనో ,లేదా పంచనో ధరించాలి .ఎ ప్రాంతానికి వెళ్ళిన అక్కడి నియమాలను ముందే తెలుసుకోవడం మంచిది .


ఏ దేవలయానికి వెళ్ళినప్పుడు ఆ దేవుడు కీర్తనలు చేయడం మంచి భక్తుల లక్షణం .తిరుమల యాత్రికులు విధిగా "గోవింద " నామస్మరణం చేయస్లీoదేనంటూ ఇటివల వార్త వచ్చిoది .దైవసంకీర్తనలు ,భజనలు మనకే కాక తోటి వారికీ ఎంతో స్పూర్తిని ,ఉతేజ్జన్ని ఇస్తాయి .

సంప్రదాయాలు,ఆచార వ్యవహారాలకు ,అనుగుణంగా దేవాలయాలలో నడుచుకోవాలి .ఉత్తరాది అర్చకులకు ,దక్షిణాది అర్చకులకు మంత్రోచ్చరణలోను ,వస్త్రదరణలోను కొంత తేడా ,మరికొంత పోలిక కనపడుతుంది .మనకు మంత్రాలూ వచ్చినా కొత్త ప్రాంతాలలో మనసులోనే చదువుకోవడo మంచిది ,పూజారులు సరిగ్గా ఉచ్చరించడం లేదంటే మనం ప్యాoటు,షర్టులతో ఉండి వాటిని చదవడం భావ్యంకాదు .

ఆధ్యాత్మిక యాత్రలకు అన్నీoటి కంటే ముఖ్యం మనసు.ఆత్మశుద్ధితో ,భక్తిప్రవృత్రులతో దైవసందర్సన చేసుకొంటే యాత్రఫలం సిద్దిస్తుంది అని పెద్దలు చేబుతారు .

Guru Pournami visistata


గురు పౌర్ణమి :

Brahmasri Chaganti Koteswara Rao Gari Sowjanyamtho


గురుర్ర్బహ్మ గురుర్విష్ణుహు గురుర్దేవో మహేశ్వరః

గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః

అనాది కాలంనించీ "ఆషాడ శుద్ధపౌర్ణమిని" "గురుపౌర్ణమి" అంటారు. మరియు దీనినే "వ్యాసపౌర్ణమి" గా పరిగణలోనికి తీసుకొని ఆ రోజు దేశం నలుమూలలా గురుపూజా మహాత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఆ రోజు ముని శ్రేష్ఠుడైన వ్యాసమహాముని జన్మతిధి కావున ఆ భగవానుని యొక్క జన్మదినం మానవ చరిత్రలొనే అది ఒక అపూర్వమైన ఆధ్యత్మికమైన మహాపర్వదినంగా విరాజిల్లుతుంది. అసలు ఈ ఆషాడ శుద్ధపౌర్ణమి యొక్క విశిష్ఠత ఏమిటో ...? ముందు తెలుసుకుందాం. దీనికి ఒక చక్కని ప్రాచీన గాధకలదు. పూర్వం "వారణాశి" లో కడుపేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారట! ఆత్రేయసగోత్రము గల ఆ బ్రహ్మణుని యొక్క పేరు 'వేదనిధీ. వాని యొక్క భార్య వేదవతీ. ఇరు ఇరువురు ఎల్లప్పుడు చక్కని ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము కలిగి జీవించుచుండేవారు. వారు సంతానము భాగ్యము కొరకై ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా; వారికి మాత్రం సంతానము కలుగలేదు. ఇలా ఉండగా; ఒకనాడు 'వేదనిధికీ ప్రతిరోజు మధ్యాహ్న సమయమందు వ్యాసభగవానులు రహస్యంగా గంగానదికి స్నానానికై వస్తూ ఉంటారని వార్త తెలుసుకుంటాడు. ఎలా అయినాసరే! వ్యాసమహర్షి దర్శనం పొందాలని ప్రతిరోజూ వేయికళ్ళతో వెతక నారంభిస్తాడు, ఒక రోజు నదీతీరాన ఒక భిక్షువు రూపం ధరించి దండధరుడైన వ్యక్తిని దర్శిస్తాడు. వెనువెంటనే "వేదనిధి" వాని పాదాలను ఆశ్రయిస్తాడు.దానికి ఆ భిక్షువు చీదరించుకుని కసరికొడతాడు. అయినా సరే! పట్టిన పాదాలను మాత్రము విడువకుండా "మహానుభావా! తమరు సాక్షాత్తు వ్యాసభగవానులని" నేను గ్రహించాను. అందుచేతనే, మిమ్మల్ని శరణు పొందగోరుచున్నాను అంటాదు. ఆ మాటలు విన్న ఆ అజ్ఞాత భిక్షువు గంగానది ఒడ్డువైపునకు నలుదిశలా బిత్తరి చూపులు చూస్తూ, ఇంకాతనను ఎవరైనా చూస్తున్నారేమో అని తలచి వెంటనే వేదనిధిని ఆప్యాంగా చేరదీసీ, నాయొక్క రహస్యం మాత్రము ఎవరికి తెలియకూడదు. ఇంతకీ నీకు ఏమికావాలొ కోరుకో అంటాడు. మహానుభావా! రేపు నా తండ్రిగారి పితృకార్యము. దానికి తమరు బ్రహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పక దయచేయవలసిందిగా నా కోరిక! అనిబదులు చేప్తాడు. అందులకు ఆ మహర్షి అతని ఆహ్వానాన్ని అంగీకరిస్తాడు.

అనంతరం ఎంతోసంతోషంగా ఇంటికి చేరుకున్న 'వేదనిధి' తన భార్యామణికి గంగానదీతీరాన జరిగిన వృత్తాంతమంతా వివరిస్తాడు. మరసటిరోజు ఉదయమే ఇచ్చిన మాటప్రకారం వారి గృహానికి విచ్చేసిన ఆ వ్యాస భగవానుని! ఆ దంపతులు ఎంతో ఆదరాభిమానాలతో వారిని పూజిస్తారు. అనంతరం వారు దేవతార్చనకు 'సాలగ్రామమూ, 'తులసీ దళాలు, పూలు మున్నగు పూజాద్రవ్యాలు సిద్ధం చేస్తారు. వారి పూజా అనంతరం ఎంతో శుచిగా మడిగా సర్వవంటకాలను సిద్ధపరచి శ్రద్ధవిధులను విధి విధానంగా నిర్వహిస్తారు. అనంతరం ఆ దంపతులు ఆ వ్యాస భగవానునికి సాష్టాంగ దండ ప్రణామం చేస్తారు. వారి అతిథ్యాని ఎంటో సంతుష్టులైన ఆ ముని శ్రేష్ఠుడు. ఓ పుణ్య దంపతులారా మీకు ఎమి వరకావాలో కోరుకోండి. నోమూలూ లేవు. చేయని వ్రతాలు లేవు అయినా! సంతానభాగ్యము మాత్రము మాకు కలుగలేదు! అని బదులు పలుకుతారు. ఓ అదర్శ దంపతులారా! అందులకు మీరు చింతించవలసిన పనిలేదు. త్వరలోమే మీకు తేజోవంతులు, ఐశ్వర్యవంతులు అయిన పదిమంది పుత్రసంతతికలిగి, మీరు చక్కని సుఖజీవనముతో జీవితంలో ఎన్నో సుఖభోగాలను అనుభవిస్తూ; అంత్యమున విష్ణుసాయుజ్యాన్ని పొందగలరు, అని అశీర్వదించి తిరుగు ప్రయాణమవుతున్న వ్యాసభగవానునితో ప్రభూ! తిరిగి తమదర్శన భాగ్యము మాకు ఎలా కలుగుతుంది? అని 'వేదనిధీ ప్రశ్నిస్తాడు. అందులకు వ్యాస మహర్షి అంటారు.....!....!....!

ఓ భూసురోత్తమా! నన్ను మరల మరల దర్శించుచూ ఉండాలని మీరు ఎంతో కోరికతో ఉన్నారని నేను గ్రహించుచున్నాను. అందువలకు నన్ను మీరు ఎలాదర్శించగలరో చెప్తాను, వినండి. ఎవరైనా ఎప్పుడైనా, ఎక్కడైనా సరే! మన వేద వేదాంగముల యొక్క రహస్యాలను, ఇతిహాసములయొక్క గూడార్థాలు ఉపదేశిస్తూ ఉంటారో! అతడే నా యొక్క నిజస్వరూపంగా తెలుసుకుని అట్టి పురాణ కథకుడైనా ఆతన్ని సాక్షాత్తు వ్యాసమూర్తిగా భావించి పూజింపవలెను. అట్టి పౌరాణికులందరిలోను నేను ఎల్లప్పుడూ ఉంటాను.

అంతియేకాదు ఎవరైనాసరే! గతకల్పాలలో జరిగిన చరిత్ర; విశ్వం యొక్క పూర్వవృత్తాంతం; పూరాణగాథలు మున్నగునవి విప్పి చెప్పాలంటే! వారికి వ్యాస భగవానుని అనుగ్రహము లేనిదె చేప్పలేరు. కావున అట్టి పౌరాణికుణ్ణి ఎంచి ఆషాఢ శుద్దపాడ్యమి"నాడు వారికి "గురుపూజ" చేసి పూజించవలెనని చెప్పారు. నాటినుండి నేటివరకు ఆచారము కొనసాగుచునే ఉన్నద అని మనము గమనిస్తున్నాము గదా!'-మరి. అది విన్న 'వేదనిధీ మరోమారు వ్యాసభవానుని ప్రశిస్తాడు. మహాత్మాతమను ఏయే రోజుల్లో ఎవిధంగా పూజించాలి? సవిస్తరంగా చెప్పవలసింది అంటాడు.

"మమ జన్మదినే సమ్యక్ పూజనీయః ప్రయత్నతః

ఆషాధ శుక్ల పక్సేతు పూర్ణిమాయాం గురౌతథా

పూజనీయే విశేషణ వస్త్రాభరణ ధేనుభిః

దక్షిణాభిః మత్స్యరూప ప్రపూజయేత్

ఏపం కృతే త్వయా విప్రః మత్స్య రూపస్య దర్శనం

భవిష్యతి నసందేహొమ యైవోక్తం ద్విజోత్తమ."

ఓ బ్రహ్మణోత్తమా! నేను జన్మించిన ఆషాధశుద్ధ పౌర్ణమినాడు ఈ గురుపూజను ఆరోజు శ్రద్ధాభక్తులతో చేయాలి. ఆ రోజు కనుక గురువారము అయిన ఎడల అది మరింతగా శ్రేష్టమైనది. వస్త్ర, అభరణ గోదానములతో అర్ఘ్య పాదాలతోటి నా రూపాన్ని పూజించువార్కినా స్వరూప సాక్షాత్కారం వార్కి లభిస్తుంది; అని సాక్షాత్తు వ్యాస పౌర్ణమి, నేటికినీ, సర్వులకు అత్యంత పుణ్య ప్రదముగా చెప్పబడుచున్నది. ఈ గాథ పూర్వము నారదుడు వైశంపాయనుడికి "ఈ గురు పౌర్ణమి యొక్క విశిష్టత వివరించినట్లుగా బ్రహ్మండ పురాణంలోనూ "స్వధర్మసింధూ" అనే గ్రంధములోను వివంగా చెప్పబడి యున్నది. దీనిని బట్టి వ్యాసులవారి యొక్క జన్మ ఆషాఢ శుద్ధపాడ్యమి అని విదితమవుచున్నది.

వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తేః పౌత్ర మకల్మషం

పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధం

వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస రూపాయ విష్ణవే

నమోవై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమోనమః

GITAMAKARANDAM_SWAMI VIDYAPRAKASHANANDAGIRI

GITAMAKARANDAM_SWAMI VIDYAPRAKASHANANDAGIRI

GITAMAKARANDAM_SWAMI VIDYAPRAKASHANANDAGIRI 

Sri Y.Sudharshan Reddy Gari Sowjanyamtho

  1. 19
    WATCHED

    MANASA BODHA_SMT VANIJAYARAM_SWAMI VIDYAPRAKASHANANDAGIRI

    by hindudevotional0 2 views
    MANASA BODHA_SMT VANIJAYARAM_SWAMI VIDYAPRAKASHANANDAGIRI
  2. 20

    TATVASARAMU_SMT SHOBHARAJ_SWAMI VIDYAPRAKASHANANDAGIRI

    by hindudevotional0 No views
    TATVASARAMU_SMT SHOBHARAJ_SWAMI VIDYAPRAKASHANANDAGIRI