Ads 468x60px

facebook

sada mee sevalo

Tuesday 23 December 2014

* అష్ట దిక్కులు- దిక్పాలకులు

మనకు నాలుగు దిక్కులు ఉన్నాయి కదా
తూర్పు- సూర్యుడు ఉదయించే దిక్కు,
పడమర - సూర్యుడు అస్తమించే దిక్కు,
దక్షిణం - సూర్యునివైపు తిరిగి నించుంటే కుడి ,
ఉత్తరం -సూర్యుని వైపు నుంచుంటే ఎడమ.

* అలాగే నాలుగు మూలలు.
ఆగ్నేయం ,
నైరుతి,
వాయువ్యం,
ఈశాన్యం
ఈ ఎనిమిది దిక్కులకు ఎనిమిది మంది దేవతలు అధికారులు. వాళ్ల వివరాలు ...
దిక్కు దేవత భార్య పట్టణం ఆయుధం వాహనం
తూర్పు ఇంద్రుడు శచి అమరావతి వజ్రాయుధం ఐరావతం
ఆగ్నేయం అగ్నిదేవుడు స్వాహా తేజోవతి శక్తి తగరు
దక్షిణం యముడు శ్యామల సంయమని పాశం దున్నపోతు
నైరుతి ని ర్రు తి దీర్ఘా దేవి కృష్ణ గమని కుంతం నరుడు
పశ్చిమం వరుణుడు కాళిక శ్రద్ధావతి దండం మొసలి
వాయువ్యం వాయువు అంజన గంధవతి ద్వజం జింక
ఉత్తరం కుబేరుడు చిత్ర రేఖి అలకాపురి కత్తి అశ్వం
ఈశాన్యం ఈశానుడు పార్వతి కైలాసం
* అష్ట దిక్కులు- దిక్పాలకులు

మనకు నాలుగు దిక్కులు ఉన్నాయి కదా

తూర్పు- సూర్యుడు ఉదయించే దిక్కు,
పడమర - సూర్యుడు అస్తమించే దిక్కు,
దక్షిణం - సూర్యునివైపు తిరిగి నించుంటే కుడి ,
ఉత్తరం -సూర్యుని వైపు నుంచుంటే ఎడమ.

* అలాగే నాలుగు మూలలు.

ఆగ్నేయం ,
నైరుతి,
వాయువ్యం,
ఈశాన్యం

ఈ ఎనిమిది దిక్కులకు ఎనిమిది మంది దేవతలు అధికారులు. వాళ్ల వివరాలు ...

దిక్కు దేవత భార్య పట్టణం ఆయుధం వాహనం

తూర్పు ఇంద్రుడు శచి అమరావతి వజ్రాయుధం ఐరావతం

ఆగ్నేయం అగ్నిదేవుడు స్వాహా తేజోవతి శక్తి తగరు

దక్షిణం యముడు శ్యామల సంయమని పాశం దున్నపోతు

నైరుతి ని ర్రు తి దీర్ఘా దేవి కృష్ణ గమని కుంతం నరుడు

పశ్చిమం వరుణుడు కాళిక శ్రద్ధావతి దండం మొసలి

వాయువ్యం వాయువు అంజన గంధవతి ద్వజం జింక

ఉత్తరం కుబేరుడు చిత్ర రేఖి అలకాపురి కత్తి అశ్వం

ఈశాన్యం ఈశానుడు పార్వతి కైలాసం

ఆలయానికి వెళ్తున్నారా..? అయితే ఇవన్నీ తప్పనిసరి!

1. ఆలయ ప్రదక్షిణలు చేసేటప్పుడు వేగం కూడదు.
2. అనవసరంగా మాట్లాడటం.. పరుషపదజాలం ఉపయోగించకూడదు
3. ఆవలింతలు, జుట్టు పీక్కోవడం, తల గీక్కోవడం, తమలపాకులు వేయకూడదు.
4. జననం, మరణం సంబంధించిన విషయాలపై మాట్లాడకూడదు.
5. టోపీలు, తలకు వస్త్రాలు కట్టుకోవడం చేయకూడదు.
6. ధ్వజస్తంభం, బలిపీఠం, గోపుర స్థలాలను తొక్క కూడదు.
7. ఆకర్షణీయ దుస్తులను ధరించకూడదు.
8. నందీశ్వరుడు, శివలింగానికి మధ్యలో వెళ్ళకూడదు.
9. దర్శనం పూర్తయ్యాక వెనకవైపు కాస్త దూరం నడిచి, తర్వాత తిరగాలి.
10. ఒక చేత్తో దర్శనం చేయకూడదు.
11. భుజాలపై టవల్స్ వేసుకుని దర్శనం చేయకూడదు.
12. ఆలయంలో భుజించడం, నిద్రించడం చేయకూడదు.
13. ఆలయంలో ఎత్తైన ప్రాంతంలో కూర్చోకూడదు.
14. బలిపీఠంలో ఉన్న సన్నిధిని మ్రొక్కకూడదు.
15. ఆలయ ఆస్తులను అపహరించకూడదు.
16. అష్టమి, నవమి, అమావాస్య, పౌర్ణమి, మాస ప్రారంభం, సోమవారం, ప్రదోషం, చతుర్థి రోజుల్లో బిల్వ దళాలను తుంచకూడదు.
17. ఆలయంలో స్నానం చేయకుండా ప్రవేశించకూడదు.
18. మూల విరాట్‌ వద్ద దీపం లేకుండా దర్శనం చేయకూడదు.
19. ఆలయానికి వెళ్లొచ్చిన వెంటే కాళ్లను కడగకూడదు. కాసేపు కూర్చున్న తర్వాతే ఇవన్నీ చేయాలి.
20. ఆలయంలోకి ప్రవేశించి, తిరిగి వచ్చేంతవరకు నిదానం ప్రదానంగా ఉండాలి.
21. గోపుర దర్శనం తప్పక చేయాలి.
22. ఆలయంలోని మర్రి చెట్టును సాయంత్రం 6గంటల తర్వాత ప్రదక్షిణలు చేయకూడదు.
23. ఆలయంలోపల గట్టిగా మాట్లాడకూడదు.
24. మన మాటలు, చేష్ఠలు ఇతరులకు ఆటంకంగా ఉండకూడదు.

తిరుపతి లడ్డు

* తిరుపతి లడ్డు
లడ్డు పేరు చేబితే వేంటనే టక్కున గుర్తోచ్చేది మన తిరుపతి లడ్డు.సామాన్యుల నుండి కోట్లకు పడగలేత్తిన భాగ్యవంతుడి వరకూ ఎంతో భక్తిభావంతో ఆరగించి తినేది తిరుపతి లడ్డు.లడ్డూలంటే మన తిరుపతి లడ్డూలే ఆరుచి మన నాలుకను చేరుకొగానే మనసంతా ఒక్కసారి భక్తిభావంతో పులకరించి మయమరుస్తుంది.శ్రీవారి ప్రసాదంలో దద్దోజనం,పోంగలి వంటివెన్నున్నా తిరుపతి లడ్డూకున్న గిరాకితో పోలిస్తే ఇవేవి సరిపోవు.
ఎవరెంత కొపంతో ఉన్నా వారికి తిరుపతి లడ్డూ ఇస్తే ఇట్టే కరిగిపొతారు.ఏపని సాదించడానికి అయిన అంతటి బ్రహ్మస్త్రం మన లడ్డూ.పూర్వకాలం నుండి శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు పంచుతున్నా 1940 ప్రాంతంలో కళ్యాణోత్సవాలు మొదలయినపుడు మనం ఇపుడు చూసే లడ్డూ తయారి మొదలైంది. దీన్ని తయారుచేయడానికి ప్రత్యెక పద్దతి అంటూ ఒకటి ఉంది.లడ్డూ తయారు చేయడానికి వాడె సరుకుల మొత్తాన్ని దిట్టం అని పిలుస్తారు.ఈదిట్టం స్కేలును 1950లో మొదట రూపొందించగా భక్తులతాకిడిని బట్టి దీనిని 2001లో సవరించారు.ఇపుడు ఈ స్కేలు ప్రకారమే లడ్డూలను తయారు చేస్తున్నారు.
శ్రీవారి లడ్డూ తయారిలో వాడే దిట్టంలో వాడేఅ సరుకులు -
ఆవు నెయ్యి - 165 కిలోలు
శెనగపిండి - 180 కిలోలు
చక్కెర - 400 కిలోలు
యాలుకలు - 4 కిలోలు
ఎండు ద్రాక్ష - 16 కిలోలు
కలకండ - 8 కిలోలు
ముంతమామిడి పప్పు -30 కిలోలుఈ మిశ్రమంలో సుమారు 5,100 లడ్డూలు వరకూ తయారవుతాయి.శ్రీవారి ఆలయం ఆగ్నేయదిక్కులో ఉన్న వంటశాలలో సుమారు 15000 వరకూ లడ్డూలు తయారవుతాయి.తొలి రోఅజుల్లో లడ్డూలను కట్టెలపొయ్యి మీద తయారుచేసేవారు.అయితే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని యంత్రాలను ప్రవేశపెట్టారు.వీటివల్ల కొంచెం రుచి,నాణ్యత తగ్గినా గిరాకి మాత్రం తగ్గలేదు.ఈ మద్యే మన లడ్డూకు పేటెంట్ హక్కు కూడా లభించింది.
* ఆలయంలో లభించే లడ్డూలు మూడు రకాలు
1.ఆస్ధానం లడ్డూ - వీటిని ప్రత్యేక వుత్సవాలు సందర్భంగా మాత్రమే తయారుచేస్తారు.ప్రత్యేక అతిధులకు మత్రమే వీటిని అందజేస్తారు.
2.కళ్యాణోత్సవ లడ్డూ - దీనిని కళ్యాణోత్సవాల సమయంలో ఉత్సవాల్లో పాల్గోనే భక్తులకు అందజేస్తారు.
3.ప్రోక్తం లడ్డూ - వీటిని సాధారణ దర్శనానికి వచ్చే భక్తులకు అందజేస్తారు.

ఆరోగ్యంగా జీవించండీ. ఆధ్యాత్మికంగా ఎదగండి.

* ఆరోగ్య సూత్రములు
ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యము అతను ఆరోగ్యము పట్ల తీసుకొను శ్రద్ధపై ఆదారపడి వుంటుంది. ప్రాణాయామము, ధ్యానములకు పరిపూరకముగా ఇచ్చుట శారీరక, మానసిక ఉన్నతికొరకు కొన్ని ఆరోగ్య సూచనలు తెలియజేయబడినది.
01. అన్ని ఋతువులు నందు స్వచ్చమైన నీరును పీలైనంత ఎక్కువగా ఏమరుపాటు లేకుండా త్రాగండి. నీరు నిజమైన సంజీవని. నీరును బాగుగా తీసుకొనట్లైతే ఆ నీరు రక్తమును పలచన చేసి రక్తనాళములలోనికి రక్తమును సరళముగా ప్రవహింప చేయును. మరియు శరీరములో జరుగు అనేక ప్రక్రియల వల్ల ఉత్పన్నమైన వేడిని బయటకు పంపివేసి శరీరమును చల్లబరుస్తుంది. ఏ విధముగానంటే కారు రేడియేటర్లోని నీరు ఏ విధంగా కారు యంత్రమును చల్లబరుచునో అదే విధముగా మనము త్రాగే నీరు మన శరీరమును చల్లగా వుంచుతుంది.
02. మనము త్రాగే నీరు శరీరములో మిగిలిన మలిన పదార్థములను వెలుపలికి పంపిచేసి శరీరమును ఆరోగ్యముగా, శుభ్రముగా ఉంచుతుంది. శారీరక అనారోగ్యమునకు, అన్ని వ్యాధులకు మూలకారణము ఈ మలిన పదార్థములే. నీరు వీతిని శుభ్ర పరస్తుంది, కావున నీరు త్రాగడం ఒక అలవాటుగా చెసుకోండి. నిద్రపోవుటకు అరగంట ముంది ఒక గ్లాసినిండా నీటిని త్రాగండి. మనము పడుకొన్న తరువాత తిన్న ఆహారము జీర్ణమై దాని సారము రక్తములో చేరి రక్తమును మందము చేయను. ఈ రక్తము మందముగా, జిగురుగా తయారై నందువలన గుండె మామూలుకన్నా ఎక్కువ ఒత్తిడికి గురై పని చేయవలసివస్తుంది. ఈ కారణముచేతనే మధ్యవయస్సులోని వ్యక్తులు, ముసలి తనములోని వ్యక్తులు రాత్రిపూట నిద్రలో గ్ండెపోటుకు గురి అవడ్ం సహజముగా జరుగుతున్నది. కావున రాత్రి నిద్రకు ముందు నీరు త్రాగడం వలన రక్తము పలుచబడి గుండె పై వత్తిడి తగ్గుతుంది మరియు శరీరమును చల్లబరచి మంచి నిద్ర రావాడానికి దోహదమవుతుంది. కావున అన్ని కాలముల యందు నీరు త్రాగడం మంచి అలవాటు.
అల్పాహరమునకు లేక భోజనమునకు ముందు ఒక గ్లాసు నీటిని త్రాగినత్లైతే ఆ నీరు కడుపులో పేరుకొని ఉన్న వాయువును (గ్యాస్) బయటకు పంపిచేయును. మరియు తక్కువ తినునట్లు చెయును. స్థూలకాయమును తగ్గించుకొనుటకు భోజనమునకు ముందు నీరు త్రాగడం మంచి ఉపాయము
అతి ప్రాచీన వైద్య పద్దతి అయిన ఆయుర్వేదము ప్రకారము మట్టి మూకుడు, మట్టిపాత్రలలో వుంచిన నీరును త్రాగినత్లైతే ఆ నీరు మంచి ఆరోగ్యమును ఇచ్చును. ఎందువలననగా ముట్టి పాత్రలకు నీరులో ఉన్న అనవసరపు అయస్కాంత త్రరంగములుగాని విద్యత్ తరంగములుగాని ఉన్నచో అటువంటి వాటిని తనలోనికి ఇముడ్చుకొని స్వచ్చమైన నీటిని మనకు అందించు తత్త్వమును కలిగియున్నవి.
03. మీ అభిరుచికి తగినట్లు భుజించండి. కాని తక్కువ కేలరీలు, ఎక్కువ పేచు పదార్థములు కలిగిన అహారమును భుజించండి.
04. మంచి విటమున్లు కలిగిన కాయగూరలను భుజించండి. ముఖ్యముగా విటమిన్ -సి మరియు వితమిన్ -ఇ కలిగినవి. ఎందుకంటే విటమిన్ -సి సహజముగా సోకే వ్యాధులు(ఉదా - జలుబు) మైదలైన వాటినుంచి ఎక్కువ రోగనిరోధక శక్తినిచ్చి కాపాడుతుంది మరియు విటమిన్ -ఇ శరీరమును తేజోవంతం చేస్తుంది.
05. మరియు కాయగూరలు శరీరమునకు తగినంత ఐరన్ను ఇస్తాయి. ఈ ఐరన్ రక్తహీనతను తగ్గించుటయే గాక రక్తములోని హిమోగ్లోబిన్ శాతమును వృద్ధి చేస్తుంది. రక్తములో ఈ హిమోగ్లోబిన్ శాతము తగ్గినంత ఉన్నప్పుడు మాత్రమే రక్తము ఊపిరితిత్తులలో వున్న ప్రాణవాయువు (ఆక్సిజన్)ను గ్రహించి మొదడుకు మరియు శరీర అవయవములకు చేరవేయును. మీరు ధీర్ఘప్రాణాయమము చేయునపుడు రక్తములో తగినంత హిమోగ్లోబిన్ శాతము లేనట్లెతే మెదడుకు మరియు శరీర అవయవములకు తగినంత ప్రాణవాయువు అందదు. అప్పుడు ధీర్ఘప్రాణాయామము తగినంత ఫలితం ఇప్వదు.
06. మానవ శరీరము పంచభూతములైన పృథివి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము మొదలైన వానితో నిర్మితమై యున్నది. అందులో భూమి, ఆకాశము స్థిరముగా వుంటే మిగిలిన అగ్ని, జలము, వాయువు చరిస్తుంటాయి. శరీరములో చరించే మధ్య అసమతౌల్యమేర్పడినట్లయితే అనేక రోగములకు కారణభూతమౌచున్నదని ఆయుర్వేదము తెలియజేయు చున్నది. త్రిఫల చూర్ణము లేదా మాత్రలు ( ఆయుర్వేద మునకు సంబంధిచిన ఓషదుల మిశ్రమము) ప్రతి దినము ప్రొద్దున పరగడుపున ఒక టే స్పూన్ పొడినిగాని లేదా మాత్రలు గాని నీటితో తీసుకొన్నట్లైతే శరీరములోని అగ్ని, జల, వాయువులను నియంత్రించి అనేక శారీరిక రుగ్మతలనుంచి కాపాడుతుంది.
07. త్రిఫలా చూర్ణమును లేదా మాత్రలు ప్రతిదినము తీసుకొన్నట్లైతే అది శరీరములోని ఎముకల కదలికలకు సహకరించుటయే గాక శరీరములో అధికముగా వున్న వేడిని తొలగించి అగ్ని(పిత్త), వాయు(వాత), కఫ(జల)లను నియంత్రించి అనేక రుగ్మతలను దూరం చేస్తుంది.
08. మీరు గనుక సంగీత ప్రీయులైతే మృధు మధురమైన సంగీతమును వినండి. అది మీకు శారీరంగా, మానసికంగా విశ్రాంతిని కలుగజేస్తుంది. రణగొణ శబ్దములతో కూడిన సంగీతము నాడులను ఉద్రేకపరచి శరీరమునకు ఇబ్బంది కలుగజేసి కాలాంతరమందు శరీర అరోగ్యమునకు హానికలిగించును.
09. ఎల్లప్పుడు అర్థవంతంమైన పుస్తకములను చుదువుచున్నట్లైతే అవి మంచి ఙ్నానమును ఇచ్చుటయే కాక ఉన్నతమైన వ్యక్తిత్వమును కలుగుచేయును.
10. కొంచెము దానగుణము వృద్ధిచేసుకొన్నట్లైతే అది మనస్సుకు సంతృప్తి కలుగజేస్తుంది. ఈ దానగుణము వలన జీవితమునకు మంచి సార్థకతను ఏర్చరుస్తుంది.
11. మంచి మరియు సృజనాత్మక ఆలోచనలు (పాజిటివ్ థింకింగ్) మనస్సును ఉన్నతం చేస్తుంది. ఆరోగ్యకరమైన మనస్సు ఆరోగ్యకరమైన శరీరమునకు పునాది వంటింది. ఎందుకంటే మనస్సే శరీరము యొక్క యజమాని కావున. ఉన్నత వ్యక్తిత్వము ఆరోగ్యకరమైన జీవనమునకు చాలా ముఖ్యము.
ఆరోగ్యంగా జీవించండీ. ఆధ్యాత్మికంగా ఎదగండి.